పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read Full News

భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ…

Read Full News

సీలింగ్ భూముల్లో బటర్ఫ్లై సిటీ రెడీమిక్స్ ప్లాంట్.. అనుమతులు లేకుండా గలీజ్ దందా?

రంగారెడ్డి జిల్లాలో బటర్ఫ్లై సిటీ పేరుతో కొనసాగుతున్న రెడీమిక్స్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. Fortune Infra Developers Private Limited ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై స్థానిక రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కడ్తాల్ మండలం కొండ్రిగాని బోడు గ్రామ పంచాయతీ పరిధిలోని సీలింగ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. రైతుల కథనం ప్రకారం సర్వే నెంబర్ 790/39లో ఉన్న సుమారు 3.20 ఎకరాల భూమిని…

Read Full News

నిజామాబాద్‌పై రేవంత్ నిర్లక్ష్యం.. ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమైంది?

నిజామాబాద్ అభివృద్ధిపై సీఎం Revanth Reddy ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో “కార్పొరేటర్లను గెలిపించండి.. నిజామాబాద్ అభివృద్ధి బాధ్యత నాది.. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా” అని సీఎం ప్రకటించారని గుర్తు చేస్తూ, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఖమ్మం, వరంగల్,…

Read Full News

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు

Nampally Railway Station లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని ఓ ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరాల్సిన Hyderabad Jaipur Special Train లో సుమారు 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొదట ఒక ఏసీ కోచ్‌లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే పక్క భోగీలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు…

Read Full News

క్రెడిట్ కార్డు పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డులు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను Cyberabad Cyber Crime Police అరెస్ట్ చేసింది. లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌ను పోలీసులు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు బ్యాంకు ప్రతినిధులమంటూ బాధితులకు ఫోన్లు చేసి తక్కువ వడ్డీ రేట్లకు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తామని నమ్మించేవారు. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీలు, యాక్టివేషన్ ఫీజు పేర్లతో డబ్బులు…

Read Full News

జనగామలో దారుణం: రూ.20 లక్షల అప్పు కోసం 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల వ్యక్తికి బలవంతపు పెళ్లి

తెలంగాణలోని Jangaon జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.20 లక్షల అప్పు తీర్చేందుకు ఓ తండ్రి, సవతి తల్లి కలిసి 18 ఏళ్ల యువతిని 45 ఏళ్ల వ్యక్తికి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన Bachannapeta మండలంలో చోటు చేసుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం, బచ్చన్నపేటకు చెందిన రాకేష్ గౌడ్ కొన్నేళ్ల క్రితం ఓ ఎస్టీ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం 18 ఏళ్ల…

Read Full News

అక్టోబర్ తర్వాతే స్థానిక ఎన్నికలా?.. ఎస్ఐఆర్, ఓటర్ జాబితా సవరణతో తెలంగాణలో రాజకీయ వేడి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అక్టోబర్ తర్వాతే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించడం కష్టమనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అక్టోబర్ 1 వరకు తుది ఓటర్ జాబితా లేదు ఎన్నికల సంఘం ఇప్పటికే ఎస్ఐఆర్ షెడ్యూల్ విడుదల…

Read Full News

రెండు నెలలుగా నిరీక్షణ.. సీరియల్ నంబర్ రావడం లేదంటూ విద్యార్థి తల్లిదండ్రుల ఆవేదన

ప్రభుత్వ హాస్టళ్లలో అడ్మిషన్ల కోసం నెలల తరబడి తిరుగుతున్నామని, సీరియల్ నంబర్లు ముందుకు కదలకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు నెలలుగా హాస్టల్ సీటు కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ స్పష్టత రావడం లేదని వారు చెబుతున్నారు. “రెండు నెలల నుంచి తిరుగుతున్నాం. పిల్లలను తీసుకొచ్చి హాస్టల్ దగ్గర పెట్టుకుంటున్నాం. కానీ సీరియల్ నంబర్లు మాత్రం ముందుకు రావడం లేదు. మా సీరియల్ 623 ఉంటే ఇప్పటికీ 151…

Read Full News

వరంగల్ రైతుల ఆవేదన.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, లారీలు లేక తీవ్ర ఇబ్బందులు

తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కుతోంది. ముఖ్యంగా వరంగల్, తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడం, లారీలు సమయానికి రాకపోవడం, వర్షాల కారణంగా ధాన్యం తడవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పంట పండించడానికి పెట్టుబడులు పెరిగిపోయాయి. యూరియా కోసం లైన్లు కట్టాం. ట్రాక్టర్లు, కూలీల ఖర్చులు భరించాం. ఇప్పుడు పంట చేతికొచ్చాక…

Read Full News