నిజం కోసం.. జనం కోసం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఓకే టీవీ తన ఐదేళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలను ప్రశ్నించే వేదికగా, అన్యాయంపై అక్షర యుద్ధం చేసే మీడియా సంస్థగా తమ ప్రయాణాన్ని ఈ గీతంలో ప్రతిబింబించారు.
“ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఓకే టీవీ”, “శ్రవ్య స్వరం.. సమరభా స్వరం” వంటి పదాలతో రూపొందిన ఈ గీతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, సామాన్యుడి హక్కుల పరిరక్షణ వంటి అంశాలను ప్రాధాన్యంగా ప్రస్తావించింది. “రాజ్యాంగమే దైవం.. ప్రజాహితమే సర్వం” అనే పంక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సామాన్య ప్రజల తరఫున పోరాడే మీడియా వేదికగా తమ బాధ్యతను ఈ పాటలో వివరించారు. “వ్యవస్థల్ని మాయ చేస్తే ఊరుకోదు మా కలం”, “సామాన్యుడి కోసమే మా నెప్పుల గళం” వంటి పంక్తులు మీడియా ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. తప్పు చేసిన వారిని ప్రజల ముందు నిలబెడతామని, నిజాలను వెలికితీసే ప్రయత్నం కొనసాగుతుందని గీతంలో పేర్కొన్నారు.
ఈ గీతంలో మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ సావిత్రిబాయి ఫూలే, వీరరుద్రమదేవి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించారు. విద్య, ధైర్యం, సేవా భావం వంటి విలువలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని సందేశం ఇచ్చారు.
“పబ్లిక్‌లో వైరల్ మా ఇంటర్వ్యూలు.. తప్పు చేసేవారికి అవి హంటర్ వ్యూలు” వంటి పంక్తులు ఓకే టీవీ ప్రత్యేక శైలిని తెలియజేస్తున్నాయి. “సత్యమే నిరూపణం.. న్యాయమే కరచరణం” అంటూ ప్రజల దీవెనలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఓకే టీవీ ఐదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసే ఈ గీతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రజల కోసం పోరాడే మీడియా సంస్థగా తమ కట్టుబాటును మరోసారి ఈ గీతం ద్వారా చాటుకుంది.

