బోరబండ ఒంటరి మహిళ ఆవేదన.. “ఇల్లు ఇస్తామన్నారు.. ఇప్పటికీ అద్దె బతుకే”
హైదరాబాద్‌లోని బోరబండ బస్తీలో నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ముందు వివరించారు. చిన్నప్పటి నుంచి బోరబండలోనే పెరిగానని, ప్రస్తుతం అద్దె ఇంట్లో చిన్న కుమార్తెతో జీవనం సాగిస్తున్నానని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “మాకు ఇల్లు ఇస్తామని, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏదీ అందలేదు. నెలకు ₹15…

